శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 19, 2020 , 12:56:38

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

 'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

ఢిల్లీ :గురు తేఘ్ బహదూర్ ‘షాహీది దివాస్’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 1621 లో జన్మించిన తొమ్మిదవ గురువు గురు తేఘ్ బహదూర్ సామాజిక సేవకు అంకితమయ్యారు. 1675 లో ఆయన ఢిల్లీలో కన్నుమూశారు. "శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ జీవితం ధైర్యం, కరుణకు నిదర్శనం. న్యాయంతో కూడిన సంపూర్ణ సమాజం కోసం ఆయన ఆరాటాన్నిగుర్తు చేసుకుంటూ, శ్రీ గురు తేఘ్‌ బహదూర్ జీ బలిదానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా"అంటూ ' మోడీ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...

  పెరిగిన పసిడి ధరలు... ఎంతంటే..?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి