శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 09:54:37

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద మోదీ నివాళి

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద మోదీ నివాళి

న్యూఢిల్లీ:  అమ‌ర్‌ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద ప్ర‌ధాని మోదీ ఇవాళ నివాళి అర్పించారు.  72వ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఉన్న నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్‌ను మోదీ సంద‌ర్శించారు. అక్క‌డ ఆయ‌న పుష్ప‌గుచ్ఛం ఉంచి .. అమ‌ర జ‌వాన్ల‌కు నివాళి అర్పించారు.  ఆ త‌ర్వాత ఆయ‌న రాజ్‌ప‌థ్ వెళ్లారు. అక్క‌డ ఆర్డీ ప‌రేడ్‌ను వీక్షించ‌నున్నారు. యుద్ధ స్మార‌కం వ‌ద్ద ఉన్న సెరిమోనియ‌ల్ బుక్‌లో మోదీ సంత‌కం చేశారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌, ఆర్మీ , నేవీ చీఫ్‌లు కూడా అమ‌ర జ‌వాన్ జ్యోతి వ‌ద్ద నివాళి అర్పించారు.  అంత‌కుముందు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌న నివాసం వ‌ద్ద జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశారు.  

VIDEOS

logo