శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 10:12:29

జవహర్‌లాల్‌ నెహ్రూకు ప్రధాని నివాళి

జవహర్‌లాల్‌ నెహ్రూకు ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : భారత ప్రప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 131 జయంతి (జాతీయ బాలల దినోత్సవం) సందర్భంగా శనివారం ప్రధాని మోదీ ఆయనకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. ‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులు...’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నెహ్రూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో నవంబర్‌ 14న 1889లో జన్మించారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి ఆగష్టు 15, 1947న స్వతంత్ర భారతదేశానికి తొలిప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1964, మే 27న ఆయన తుదిశ్వాస విడిచారు. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. పిల్లలంటే ఎనలేని ఇష్టం కారణంగా ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.