శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 20:09:46

బ్రతకాలి.. ముందుకు సాగాలి : ప్రధాని మోదీ

బ్రతకాలి.. ముందుకు సాగాలి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించారు. ఈ నెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వైరస్‌ నుంచి మనం మనల్ని కాపాడుకుంటూనే ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని మోదీ స్పష్టం చేశారు. కరోనాకు ముందుకు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3 లక్షలకు పైగా మంది మరణించారు. నాలుగు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని మోదీ తెలిపారు. కరోనాతో పోరాడుతూనే జీవనం కొనసాగించాలని ప్రజలకు ప్రధాని సూచించారు. 

కరోనా ఆపదను ఎదుర్కొనేందుకు జాతి మొత్తం ఒక్కటై నిలబడింది. కరోనా మనకు ఆపదతో పాటు అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం. కరోనాకు ముందు దేశంలో ఒక్క పీపీఈ కిట్టు కూడా తయారు కాలేదన్నారు. దేశంలో ఎన్ -95 మాస్కులు కూడా నామమాత్రంగా తయారయ్యేవి. ఇప్పుడు పీపీఈ కిట్లు, మాస్కుల తయారీలో స్వయం సమృద్ధి సాధించామన్నారు. మన దగ్గర తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం అని మోదీ అన్నారు.


logo