మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:31:31

రైతులకు రక్షణ కవచాలు

రైతులకు రక్షణ  కవచాలు

  • దళారీలకు మద్దతిచ్చేవారే బిల్లులను వ్యతిరేకిస్తున్నారు
  • మద్దతు ధరల విధానం కొనసాగుతుంది: మోదీ

న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లులు రైతులకు ‘రక్షణ కవచాలు’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వారంతా రైతులను తప్పుదోవ పట్టిస్తూ, దళారీలకు మద్దతుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. బీహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ బిల్లులు చట్టంగా మారినా ఇప్పుడు ఉన్నట్టుగానే కేంద్రం రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని, మద్దతు ధరల విధానం యథాతథంగా అమల్లో ఉంటుందని మోదీ చెప్పారు. మరోవైపు, తన పుట్టిన రోజున ‘మీకు ఏం గిఫ్ట్‌ కావాలి’ అని చాలా మంది అడిగారని, ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించడమే తనకు గొప్ప బహుమానం అని మోదీ అన్నారు. 


logo