బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:00:58

హైటెక్ టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభించిన ప్ర‌ధాని

హైటెక్ టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభించిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్రమోదీ సోమ‌వారం సాయంత్రం హైటెక్ టెస్టింగ్ సదుపాయాల‌ను ప్రారంభించారు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) నోయిడా, కోల్‌క‌తా, ముంబై న‌గ‌రాల్లో హైటెక్ టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త‌గా ప్రారంభించిన ఈ హైటెక్ ల్యాబ్‌లు కేవ‌లం క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లకు మా‌త్ర‌మే ప‌రిమితం కాద‌ని, భ‌విష్య‌త్తులో వీటిని హెప‌టైటిస్ బీ, హైప‌టైటిస్ సీ, హెచ్ఐవీ, డెంగ్యూ లాంటి చాలా వ్యాధుల‌కు సంబంధించిన నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేలా విస్త‌రిస్తార‌ని ప్ర‌ధాని చెప్పారు. దేశంలో మొత్తం 11000 క‌రోనా చికిత్స కేంద్రాలు, 11 ల‌క్ష‌లకుపైగా ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 1300 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయ‌ని, రోజుకు 5 ల‌క్ష‌ల‌కుపైగా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo