శుక్రవారం 03 జూలై 2020
National - Jun 20, 2020 , 17:00:07

రూ.50వేల కోట్లతో ’గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌'

రూ.50వేల కోట్లతో ’గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌'

బీహార్‌ : కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకుప్రధాని మోదీ సరికొత్త పథకాన్ని ప్రకటించారు. బీహార్‌ రాష్ట్రంలోని కజారియా జిల్లా తెలిహర్‌ గ్రామంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోడీ సమక్షంలో గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ (జీకేఆర్‌ఏ) పథకాన్ని ప్రారంభించి రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలు కరోనాపై అద్భుతంగా పోరాడుతున్నారని, వీరి పోరాట మార్గం నగర ప్రజలకు పాఠం కావాలన్నారు. ఎవరు మీ పనిని అంగీకరించినా.. అంగీకరించకపోయినా కరోనాపై పోరాటంలో మీ సహకారాన్ని అభినందిస్తున్నానన్నారు. ‘మీరు ఇంటి వద్ద పని చేసుకోవాలన్నదే మా ప్రయత్నం.  ఇప్పటి వరకు నగరాలను అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీ గ్రామాలకు సహాయపడే సమయం వచ్చింది. ఇంటర్‌ నెట్‌ స్పీడుతో పనివేగాన్ని పెంచండి. ఫైబర్‌ కేబుల్‌ వేసే బాధ్యత మేము తీసుకుంటాం’ అని కార్మికులనుద్దేశించి ప్రధాని అన్నారు. 


logo