శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 14:45:26

సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన ప్ర‌ధాని మోదీ

సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లో సీప్లేన్ స‌ర్వీసును ప్రారంభించారు. కేవ‌డియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి  అహ్మ‌దాబాద్‌లోని రివ‌ర్‌ఫ్రంట్ వ‌ర‌కు ఈ సీప్లేన్ స‌ర్వీసులు అందించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ.. కేవ‌డియా నుంచి స‌బ‌ర్మ‌తి వ‌ర‌కు సీప్లేన్‌లో ప్ర‌యాణించారు.  ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య సుమారు 200 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ట్విన్ ఇంజిన్ ప్లేన్‌ను స్పైస్‌జెట్ సంస్థ ఈ స‌ర్వీసుల కోసం వినియోగిస్తున్న‌ది.  స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ వ‌ద్ద ఉన్న పాండ్‌-3 నుంచి ప్ర‌ధాని మోదీ సీప్లేన్‌లో ప్ర‌యాణించారు.  వాట‌ర్ ఏరోడ్రోమ్ వ‌ద్ద కొంత స‌మ‌యం ఆయ‌న గ‌డిపారు. 200 కిలోమీట‌ర్ల దూరాన్ని సీప్లేన్ సుమారు 40 నిమిషాల్లో చేరుకుంటుంది.  ఈ సీప్లేన్‌లో మొత్తం 19 సీట్లు ఉంటాయి.