శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 02:52:50

ఘనంగా దీపావళి సంబురాలు

ఘనంగా దీపావళి సంబురాలు

న్యూఢిల్లీ: దీపావళి వేడుకలు దేశ, విదేశాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దేశ ప్రజలు దీపావళిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. దీపాలు, లైట్లు, పూలతో ఇండ్లను అలంకరించుకున్నారు. పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రా్రష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌లోని లోంగెవాలా సైనిక పోస్టుకు శనివారం వెళ్లిన మోదీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విస్తరణ కాంక్ష, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశాలకు దీటైన జవాబిస్తామని చైనా, పాకిస్థాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అనంతరం యుద్ధ ట్యాంకుపై ప్రయాణించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా, నేపాల్‌, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లో కూడా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి.