శనివారం 16 జనవరి 2021
National - Dec 24, 2020 , 13:07:27

ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థుడు.. ఆ న‌లుగురి కోస‌మే ప‌నిచేస్తున్నారు

ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థుడు.. ఆ న‌లుగురి కోస‌మే ప‌నిచేస్తున్నారు

హైద‌రాబాద్‌: పెట్టుబ‌డిదారుల కోసం మాత్ర‌మే ప్ర‌ధాని మోదీ ప‌నిచేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా.. వారిని ఉగ్ర‌వాదులుగా ముద్ర వేస్తున్నార‌ని ఆరోపించారు.  రైతులైనా, కార్మికులైనా, మోహ‌న్ భ‌గ‌వ‌త్ అయినా ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌హార శైలి అలాగే ఉంద‌ని రాహుల్ విమ‌ర్శించారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని,  అది కేవ‌లం ఊహాల్లో మాత్ర‌మే ఉంద‌ని, నిజానికి అలాంటిది ఏమీ లేద‌ని రాహుల్ అన్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వెళ్తున్న కాంగ్రెస్ నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న త‌ర్వాత మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థుడు అని, ఆయ‌న‌కు ఏమీ అర్థం కావ‌డం లేద‌ని, కేవ‌లం ముగ్గురు లేదా న‌లుగురు వ్య‌క్తుల కోసం మాత్ర‌మే ఆయ‌న ప‌నిచేస్తున్న‌ట్లు ఆరోపించారు.  దేశ స‌రిహ‌ద్దుల వ‌ల్ల ఇంకా చైనా ఉన్న‌ద‌ని,  భార‌త భూభాగానికి చెందిన వేలాది ఎక‌రాల నేల‌ను ఆ దేశం ఆక్ర‌మించింద‌ని, ఆ అంశంలో ప్ర‌ధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని రాహుల్ ప్ర‌శ్నించారు.