బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 17:12:46

ఆయుష్ వైద్యుల‌తో మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్‌

 ఆయుష్ వైద్యుల‌తో మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్‌

హైద‌రాబాద్‌:  ఆయుష్ వైద్య ప్ర‌తినిధుల‌తో ఇవాళ ప్ర‌ధాని మోదీ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఆయుర్వేద‌, యోగా, యునాని, సిద్ధ‌, హోమియోప‌తి ప్రొఫెష‌న‌ల్స్‌తో ఆయ‌న మాట్లాడారు.  క‌రోనా వైర‌స్ గురించి మోదీ .. ఆయా వైద్య ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించారు.  దేశాన్నిఆరోగ్యం ఉంచే సంప్ర‌దాయం ఆయుష్‌కు ఉంద‌న్నారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో ఆ విభాగం ప్రాముఖ్య‌త పెరిగింద‌న్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న‌ల మేర‌కు ఆయుష్ ప్ర‌తినిధులు ప‌ని చేయాల‌ని మోదీ సూచించారు. విప‌త్క‌ర స‌మ‌యంలో స్ట్రెస్‌కు లోనుకాకుండా ఉండేందుకు తీసువాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను యోగా మినిస్ట్రీ చెబుతోంద‌న్నారు. దేశంలో ఉన్న హెల్త్ వ‌ర్క్‌ఫోర్స్‌ను వినియోగించి వైర‌స్‌ను నియంత్రించాల‌న్నారు. ఆయుష్‌తో లింకున్న ప్రైవేటు డాక్ట‌ర్లు కూడా ఈ పోరులో భాగ‌స్వామ్యం కావాల‌న్నారు. ఆయుష్ మందులు త‌యారు చేసే సంస్థ‌లు.. శానిటైజ‌ర్లు కూడా ఉత్ప‌త్తి చేయాల‌న్నారు. సామాజిక దూరం గురించి కూడా చైత‌న్య‌ప‌ర‌చాల‌న్నారు. కోవిడ్‌19పై ప్ర‌ధాని మోదీ చేస్తున్న పోరును కూడా ఆయుష్ వైద్యాధికారులు మెచ్చుకున్నారు.  రేడియో జాకీల‌తో కూడా మోదీ ఇలాంటి విష‌యాల‌నే చ‌ర్చించారు.  logo