గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:20:50

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు మోదీ సూచనలు

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు మోదీ సూచనలు

న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ మార్గనిర్దేశం చేశారు. బుధవారం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ విధానాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. సభలోనూ, ప్రజా క్షేత్రంలోనూ చురుగ్గా ఉండాలన్నారు. ప్రజలతో మేమేకం కావాలని, సాంకేతిక, సామాజిక మాధ్యమాల అవసరాన్ని గుర్తించాలని పునరుద్ఘాటించారు.

కొత్తగా ఎన్నికైన బీజేపీ రాజ్యసభ ఎంపీలతో అద్భుతమైన సంభాషణ జరిగిందంటూ అనంతరం ప్రధాన మోదీ ట్వీట్ చేశారు. ప్రజా‌సేవ‌ పట్ల వారి అభిప్రాయాలు, అభిరుచి చాలా అద్భుతంగా ఉందన్నారు. విభిన్నమైన ఎంపీల బృందం సమర్థవంతమైన పార్లమెంటరీ కార్యకలాపాలకు కృషి చేయగలదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
logo