మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 12:50:57

మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : గుజరాత్‌లో ప్రధానికి మోదీ శనివారం కిసాన్‌ సూర్యోదయతోసహా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. పగటిపూట రైతులకు సాగుకు విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ఇటీవల ఈ పథకాన్ని ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు సాగుకు విద్యుత్‌ అందించడమే పథకం ముఖ్య ఉద్దేశం. పథకంలో భాగంగా టాన్స్‌ఫార్మర్లలతోపాటు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3500 కోట్లను కేటాయించింది.

అదేవిధంగా అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పిడియాట్రిక్‌ హార్ట్‌ హాస్పిటల్‌, టెలీ కార్డియాలజీ మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు. రూ.470 కోట్ల వ్యయంతో హాస్పిటల్‌ను 450 పడకల నుంచి 1251 పడకలకు విస్తరిస్తున్నారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్డియాక్‌ టీచింగ్‌ ఇనిస్టిట్యూట్‌గా, ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్డియాక్‌ హాస్పిటల్‌గా ఇది నిలువనుంది. వీటితోపాటు ప్రధాని గిర్నార్‌ రోప్‌ వేను ప్రారంభించనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.