బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 12:48:48

రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్ ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్ ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఉద‌యం సూర‌త్, సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానిమోదీతోపాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ కూడా పాల్గొన్నారు. ఈ ఫెర్రీ స‌ర్వీస్ వ‌ల్ల సూర‌త్, సౌరాష్ట్ర మ‌ధ్య దూరం 317 కిలోమీట‌ర్ల నుంచి కేవ‌లం 60 కిలోమీట‌ర్ల‌కు త‌గ్గిపోయింది. అంటే రోడ్డు మార్గానా 317 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి బ‌దులుగా స‌ముద్ర మార్గంలో కేవ‌లం 60 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి గ‌మ్యాన్ని చేరుకోవ‌చ్చు. 

సాధార‌ణంగా సౌరాష్ట్ర‌కు చెందిన చాలామంది ఉపాధి కోసం సూర‌త్‌కు వ‌ల‌స వెళ్తుంటారు. సూర‌త్‌లోని డైమండ్ ప‌రిశ్ర‌మ‌ల్లో వారు ప‌నిచేస్తుంటారు. దాంతో సూర‌త్, సౌరాష్ట్ర మ‌ధ్య నిత్యం 5,000 బ‌స్సు స‌ర్వీసులు న‌డుస్తుంటాయి. బ‌స్సు ప్ర‌యాణానికి దాదాపు 10 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. తాజాగా ఫెర్రీ స‌ర్వీస్ ప్రారంభం కావ‌డంతో సౌరాష్ట్ర వాసుల‌కు ప్ర‌యాణ స‌మ‌యం, ఖ‌ర్చులు క‌లిసి రానున్నాయి. కేవ‌లం నాలుగు గంట‌ల్లో గ‌మ్యాన్ని చేరుకునే అవ‌కాశం క‌లిగింది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.