ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:25:59

అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయం

అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయం

  • మానవతకు పెద్దపీట: మోదీ  
  • మారిషస్‌ సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని 

న్యూఢిల్లీ, జూలై 30: అభివృద్ధికి సంబంధించిన సహకారంలో భాగస్వామ్య దేశాలపై భారతదేశం ఎలాంటి షరతులు విధించదని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధికి సహకారం పేరుతో మిత్రదేశాలపై రాజకీయంగా, వాణిజ్యపరంగా భారత్‌ ఎన్నటికీ బేరసారాలకు దిగదని స్పష్టంచేశారు. మారిషస్‌ రాజధాని పోర్ట్‌లూయిస్‌లో భారత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సుప్రీంకోర్టు నూతన భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌తో కలిసి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. భారతదేశ అభివృద్ధి విధానం వ్యక్తి కేంద్రంగా ఉంటుందని తెలిపారు. మానవత సంక్షేమానికే ప్రాధాన్యమిస్తామని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు నూతన భవనం భారత్‌, మారిషస్‌ దేశాల పరస్పర సహకారానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. మారిషస్‌ అభివృద్ధిలో భారతదేశ సహకారం వెలకట్టలేనిదని ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ అన్నారు. 4700 చదరపు మీటర్లలో నిర్మించిన సుప్రీంకోర్టు భవనం పది అంతస్తులు ఉంటుంది. 353 మిలియన్‌ డాలర్ల వ్యయంతో మారిషస్‌లో భారత్‌ చేపట్టిన ఐదు ప్రాజెక్టుల్లో సుప్రీంకోర్టు భవన నిర్మాణం ఒకటి.  logo