గురువారం 21 జనవరి 2021
National - Dec 18, 2020 , 07:02:02

‘కిసాన్‌ కల్యాణ్‌’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని

‘కిసాన్‌ కల్యాణ్‌’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో కిసాన్‌ కల్యాణ్‌ యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించనున్నారు. కాగా, ప్రభుత్వం కొత్తగా రూపొందించిన వ్యవసాయ చట్టాలపై అపోహలు తొలగిపోవాలంటే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాసిన లేఖను రైతులందరూ చదవాలని ట్విటర్‌ వేదికగా ప్రధాని కోరారు. కొత్త సాగుచట్టాలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తోమర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేఖ రాశారు. ఆ లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ ఎనిమిది పేజీల లేఖ అందేలా చేయాలని ఆయన కోరారు. ఈ బహిరంగ లేఖ ద్వారా తోమర్.. రైతులతో మర్యాదపూర్వక సంభాషణ జరపడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రధాని మోదీ ప్రశంసింస్తూ ట్వీట్ చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్, వామపక్షాలు, పలు ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు. రైతుల లబ్ధి కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు ఆయన లేఖలో వివరించారు. 


logo