గురువారం 09 జూలై 2020
National - Apr 27, 2020 , 11:16:25

సీఎంల‌తో మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ ప్రారంభం

సీఎంల‌తో మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ ప్రారంభం

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి సీఎంల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌డం ఇది మూడ‌వ‌సారి. అయితే లాక్‌డౌన్ ఎత్తివేత అంశాన్ని సంబంధించి ఇవాళ సీఎంల‌తో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ద‌శ‌ల‌వారీగా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయి.  ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ ప‌రుగులు పెట్టించేందుకు ప్ర‌ధాని ఈ స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.  అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయాలంటే, లాక్‌డౌన్ పొడిగించాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.logo