శనివారం 23 జనవరి 2021
National - Nov 30, 2020 , 15:38:06

బీఈ, రెడ్డీస్ కంపెనీ అధిప‌తుల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌

బీఈ, రెడ్డీస్ కంపెనీ అధిప‌తుల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌

హైద‌రాబాద్‌: కోవిడ్ టీకా అభివృద్ధి చేస్తున్న జెన్నోవా బ‌యోఫార్మ‌సీ, బ‌యోలాజిక‌ల్ ఈ లిమిటెడ్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీ సంస్థ‌ల‌ అధినేత‌ల‌తో ప్ర‌ధాని మోదీ ఇవాళ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. జెన్నోవా కంపెనీ పుణెలో ఉండ‌గా,  మిగ‌తా రెండు కంపెనీలు హైద‌రాబాద్ అడ్డా‌గా ప‌నిచేస్తున్నాయి.  కోవిడ్ టీకా మాన‌వ ట్ర‌య‌ల్స్ కోసం బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ‌కు అక్టోబ‌ర్‌లో అనుమ‌తి వ‌చ్చింది.  జెన్నోవా సంస్థ త‌న వ్యాక్సిన్‌ను డిసెంబ‌ర్‌లో ట్ర‌య‌ల్స్‌కు పంప‌నున్న‌ది.  ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ త‌ర‌హాలో ఎం-ఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను జెన్నోవా త‌యారు చేస్తున్న‌ది. ఇక ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను.. ఇండియాలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ట్ర‌య‌ల్ చేస్తున్న‌ది. ఒక‌వేళ అన్ని ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్తే, ఆ సంస్థ‌ల‌కు అన్ని అనుమతులు ద‌క్కితే, అప్పుడు వ‌చ్చే ఏడాది ఈ కంపెనీలు ల‌క్ష‌ల సంఖ్య‌లో కోవిడ్ టీకా డోసులు త‌యారు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  

వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారులు, దానికి సంబంధించిన అన్ని అంశాల్లో అన్ని శాఖ‌ల అనుమ‌తలు త్వ‌ర‌తిగ‌తిన ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఫార్మా కంపెనీలు ఉత్ప‌త్తి చేస్తున్న టీకాలు దేశ‌, ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌త శ‌నివారం ప్ర‌ధాని మోదీ మూడు న‌గ‌రాల్లో ఉన్న ఫార్మా కంపెనీల‌ను విజిట్ చేసిన విష‌యం తెలిసిందే.  అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్‌, హైద‌రాబాద్‌లోని భార‌త్‌బ‌యోటెక్‌, పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్‌ల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. కోవిడ్ టీకా పురోగ‌తిపై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. 


logo