సోమవారం 30 మార్చి 2020
National - Mar 08, 2020 , 12:28:52

సోషల్‌ మీడియా ఖాతాలను మహిళలకు అప్పగించిన మోదీ

సోషల్‌ మీడియా ఖాతాలను మహిళలకు అప్పగించిన మోదీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్‌ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ముందుగానే చెప్పిన విధంగా ఆయన ఆ ఖాతాలను స్ఫూర్తివంతమైన మహిళలకు ఆదివారం హ్యాండ్‌ ఓవర్‌ చేశారు. ఈ మేరకు మోదీ ఇవాళ ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. 7 మంది స్ఫూర్తివంతమైన మహిళలు తన సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహిస్తారని, వారు తమ జీవిత విశేషాలను నెటిజన్లతో పంచుకుంటారని మోదీ తెలిపారు. అనేక రంగాల్లో ఆ 7 మంది మహిళలు కృషి చేశారని, వారి జీవితాలు అనేక మందికి ప్రేరణగా నిలుస్తాయని, వారి విజయాల్ని మనం సెలబ్రేట్‌ చేసుకోవాలని, వారి నుంచి మనం నేర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. 

ఇక ఆ 7 మంది మహిళల్లో ఒకరైన స్నేహా మోహన్‌దాస్‌ తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఓ వీడియో ద్వారా వివరిస్తూ దాన్ని ట్వీట్‌ చేశారు. ఫుడ్‌ బ్యాంక్‌ ఇండియా పేరిట పేదల ఆకలి తీర్చుతున్నట్లు ఆమె వివరించారు. 



logo