ఆదివారం 17 జనవరి 2021
National - Dec 04, 2020 , 10:44:49

నేవీ డే శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ

నేవీ డే శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ

హైద‌రాబాద్‌:  ఇవాళ నౌకాద‌ళ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ.. నౌకాద‌ళ సిబ్బందికి, వారి కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త నౌకాద‌ళం అత్యంత ధైర్య‌సాహాసాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోందని, దేశ తీరాల‌ను ఆ ద‌ళాలు ర‌క్షిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నేవీ.. మాన‌వ సహాయాన్ని కూడా అందిస్తోంద‌న్నారు. శ‌తాబ్ధాల నుంచి భారత స‌ముద్ర గ‌స్తీ చేప‌ట్టిన కృషిని గుర్తించామ‌న్నారు.  ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నేవీ డే సంద‌ర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు.  అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ద‌ళాల‌కు ఆయ‌న విషెస్ చెప్పారు.  నౌకాద‌ళ భ‌ద్ర‌తా సిబ్బంది భార‌త తీరాల ర‌క్ష‌ణ‌లో ముందుంటోంద‌న్నారు.  నౌకాద‌ళ సిబ్బంది క‌న‌బ‌రిచిన ధైర్యం, సాహ‌సం, ప్రొఫెష‌న‌లిజం అద్భుత‌మ‌ని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు.