శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 13:10:31

ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని శుభాకాంక్షలు

ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. రాష్ట్ర 21వ అతరణ దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ధాని ట్వీట్ చేశారు. ప్ర‌కృతి అందాలు, సహజ వనరుల‌కు నెల‌వైన ఉత్త‌రాఖండ్ అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. స‌హ‌జ వ‌న‌రులు, ప్ర‌కృతి అందాల‌‌కు నిల‌య‌మైన ఈ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతున్న‌ద‌ని, మున్ముందు మరిన్ని అభివృద్ధి శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాని అని అన్నారు. 

ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయ‌క్ కూడా ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ‌