శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 14:59:09

ములాయంసింగ్‌కు బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పిన ప్ర‌ధాని

ములాయంసింగ్‌కు బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ: స‌మాజ్‌వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయంసింగ్ యాద‌వ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ములాయంసింగ్ దేశంలోనే అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడ‌ని, ప్ర‌జా సంక్షేమంపై అపార‌మైన అనుభ‌వం ఉన్న నేత అని ప్ర‌ధాని మోదీ కొనియాడారు. వ్య‌వ‌సాయం, గ్రామీణాభివృద్ధి కోసం ములాయం ఎన‌లేని కృషి చేశార‌ని పేర్కొన్నారు. ములాయం క‌ల‌కాలం ఆయురోగ్యాల‌తో జీవించాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.