బుధవారం 02 డిసెంబర్ 2020
National - Sep 21, 2020 , 15:07:43

ప్ర‌తిప‌క్షాలు వివాద సృష్టిక‌ర్త‌లు: ప‌్ర‌ధాని మోదీ

ప్ర‌తిప‌క్షాలు వివాద సృష్టిక‌ర్త‌లు: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ‌వ్య‌వ‌సాయ బిల్లులపై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేయ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల వ‌ల్ల త‌మ ఓటు బ్యాంకు చేజారిపోతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చెందుతున్నాయ‌ని, అందుకే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఆయ‌న ఎద్దేవా చేశారు. 21వ శతాబ్దిలో దేశం ముందుకు సాగడానికి వ్యవసాయ చట్టాలు అత్యంత అవసరమని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్మాతలుగా మారాయ‌ని ఆయ‌న‌ ధ్వజమెత్తారు.

ప్ర‌ధాని ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లో.. 'కొత్త చట్టాలతో చాలా మందికి కొత్త ఇబ్బందులు వచ్చాయి. కొత్త చ‌ట్టాల‌వ‌ల్ల‌ మండీలకు ఏం న‌ష్టం జరుగుతుంది? అవేమైనా మూతపడుతాయా?' అని ప్ర‌శ్నించారు. కొత్త చట్టాల‌తో మార్కెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని, అవి కొనసాగుతాయని, గతంలో కంటే మరింత మెరుగ్గా పనిచేస్తాయని ఆయన ప్రకటించారు. కొత్త చట్టాలతో మార్కెట్‌కు నష్టం వాటిల్లుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని మోదీ చెప్పారు. ప్ర‌తిప‌క్షాలు వివాద సృష్టిక‌ర్త‌లని, ప్ర‌తిదీ వివాదం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.