మంగళవారం 31 మార్చి 2020
National - Mar 15, 2020 , 01:07:47

11 మందిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

11 మందిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన వధూవరులు సహా మొత్తం 11 మందిని బలిగొన్నది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షెగడ్‌ సబ్‌డివిజన్‌లోని సోయింటర గ్రామంలో ట్రక్కు, కారు ఢీకొని విక్రం, సీత అనే వధూవరులతోపాటు వారివెంట ఉన్న తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. రామ్‌దేవొరలోని ప్రఖ్యాత బాబారామ్‌దేవొ ఆలయంలో దర్శనం కోసం బార్మర్‌ పట్టణంలోని బల్హోత్ర నుంచి కారులో వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. 


logo
>>>>>>