మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 19:03:48

పాకిస్థాన్‌ విమాన ప్రమాదం దురదృష్టకరం: ప్రధాని మోదీ

పాకిస్థాన్‌ విమాన ప్రమాదం దురదృష్టకరం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

పాకిస్థాన్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచి విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన  పీకే-303 విమానం కుప్పకూలింది. లాహోర్‌ నుంచి కరాచీకి వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు నివాసాలపై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదాలు మరణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.


logo