బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:28:36

ఆర్థిక సవాళ్లపై చర్చించిన భారత్‌, జపాన్‌ ప్రధానులు

ఆర్థిక సవాళ్లపై చర్చించిన భారత్‌, జపాన్‌ ప్రధానులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, ఆర్థిక సవాళ్లను గురించి ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజోతో అబే చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని గురించి ఇరువురు నేతలు టెలిఫోన్‌లో మాట్లాడారు. కరోనాను కట్టడి చేయడానికి, ప్రస్తుత విపత్తును ఎదుర్కోవడానికి ఇరు దేశాలు సహాయ సహకారాలు  అందించుకోవడంపై, తమ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఇదేవిధంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి జపాన్‌ ప్రధాని షింజో అబేతో ఫలవంతమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కరోనా తదనంతరం ప్రపంచానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారత్‌, జపాన్‌ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తచేశారు.


logo