బుధవారం 27 జనవరి 2021
National - Dec 02, 2020 , 18:38:38

తుఫాన్ ప‌రిస్థితిపై ప్ర‌ధానితో మాట్లాడా: కేర‌ళ సీఎం

తుఫాన్ ప‌రిస్థితిపై ప్ర‌ధానితో మాట్లాడా: కేర‌ళ సీఎం

న్యూఢిల్లీ: ‌బువేరి తుఫాన్ ఈ నెల 4న ద‌క్షిణ త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి, పాంబ‌న్ మ‌ధ్య తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు అప్ర‌మ‌త్త‌మై తుఫాను న‌ష్టాన్ని త‌గ్గించ‌డం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాట్లు ప‌క్కాగా చేస్తున్నామ‌ని కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. తుఫాన్ ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడార‌ని, తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల గురించి ఈ సంద‌ర్భంగా తాను ప్ర‌ధానికి వివ‌రించాన‌ని విజ‌య‌న్ తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo