మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 15:02:20

కోసి రైల్‌ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని

కోసి రైల్‌ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని

న్యూఢిల్లీ : బీహార్‌ చారిత్రాత్మక కోసి రైల్‌ మెగా రైల్వే బ్రిడ్జీని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బీహార్‌ రైల్వే అనుసంధానంలో ఈ రోజు చరిత్రలో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు. సుపౌల్‌, ఆరారియా, సహస్ర జిల్లాల ప్రజల రాకపోకలకు ఈ వంతెన ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రైల్వే వంతెన నిర్మాణంతో నిర్మాలి-సరియాఘర్‌ మధ్య 300 కిలోమీటర్ల దూరం 22 కిలోమీటర్లకు తగ్గింది. 

85 ఏండ్ల క్రితం మిథిలా, కోసి పరివాహక ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ బ్రిడ్జి కూలిపొయింది. నాటి నుంచి కోసి నది ప్రవాహం, స్వభావం కారణంగా బ్రిడ్జీ నిర్మాణం సాధ్యపడలేదు. 2003లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కోసి రైల్వే బ్రిడ్జీ (మహావంతెన) నిర్మాణ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి రూ.516 కోట్లు కేటాయించింది. ఇక్కడి వలస కార్మికులు సైతం వంతెన నిర్మాణంలో పాల్పంచుకున్నారు. కరోనా సమయంలో బ్రిడ్జీ నిర్మాణం పూర్తయ్యింది. ఈ రైలు వంతెన ప్రారంభంతో బీహార్, తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పడింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo