మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 12:46:48

జ‌పాన్ నూత‌న ప్ర‌ధానికి మోదీ శుభాకాంక్ష‌లు

జ‌పాన్ నూత‌న ప్ర‌ధానికి మోదీ శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ: జ‌పాన్ నూత‌న ప్ర‌ధాని యొషిహిడే సుగాకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. యొషిహిడే సుగా హ‌యాంలో భార‌త్‌, జ‌పాన్ ప్ర‌త్యేక వ్యూహా బంధాలు, అంత‌ర్జాతీయ సంబంధాలు కొత్త పుంత‌లు తొక్కుతాయ‌ని తాను భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు. 'జ‌పాన్ నూత‌న ప్ర‌ధానిగా ఎన్నికైన యొషిహిడే సుగాకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. సుగాతో క‌లిసి భార‌త్‌-జ‌పాన్ వ్యూహాత్మ‌క బంధాలు, అంత‌ర్జాతీయ సంబంధాల‌ను ఉన్న‌త శిఖరాల‌కు చేర్చాల‌ని తాను ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. 

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే అనారోగ్య కార‌ణాల‌తో గ‌త నెల త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామాను ఆమోదించిన జ‌పాన్ పార్ల‌మెంటు.. తాజాగా కొత్త ప్ర‌ధానిని ఎంపికచేసింది. బుధ‌వారం జ‌పాన్ దిగువ‌స‌భ‌లో జ‌రిగిన ఓటింగ్‌లో మెజారిటీ స‌భ్యులు యొషిహిడేకు అనుకూలంగా ఓటు వేసి గెలిపించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు, అభినంద‌న‌లు తెలియ‌జేశారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo