గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 10:10:20

బీవండి ప్ర‌మాద మృతుల‌కు ప్ర‌ధాని సంతాపం

బీవండి ప్ర‌మాద మృతుల‌కు ప్ర‌ధాని సంతాపం

న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర‌లోని బీవండిలో మూడంత‌స్థుల భ‌వ‌నం కూలిన దుర్ఘ‌ట‌న‌లో మృతుల‌కు ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపారు. వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవ‌నం కూలిపోవ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. బాధితుల‌ను అన్నివిధాల ఆదుకుంటామ‌ని చెప్పారు. వారికి కావాల్సిన స‌హాయం అందిస్తామ‌ని వెల్ల‌డించారు.  

ముంబై స‌మీపంలోని బీవండీలోని ప‌టేల్ కాంపౌండ్ ఏరియాలో ఉన్న ఓ మూడంత‌స్థుల భ‌వనం ఈరోజు తెల్ల‌వారుజామున 3.40 గంట‌ల‌కు కూలిపోయింది. దీంతో 10 మంది మృతిచెందారు. మ‌రో 25 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఓ చిన్నారి స‌హా 31 మందిని స్థానికులు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ర‌క్షించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి.     


logo