బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 19:46:16

అఖిల పక్షాలతో భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితిపై ప్రధాని చర్చ

అఖిల పక్షాలతో భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితిపై ప్రధాని చర్చ

న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆయా పార్టీల నేతలతో భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిపై గాల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా దళాలు దాడి చేసిన తీరుపై ప్రధాని చర్చించారు. దాడిలో మృతి చెందిన వీర సైనికులకు నివాళులర్పించారు. సుమారు 20పార్టీల ప్రతినిధులు వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధానితో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.  logo