శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:50:36

మధ్యప్రదేశ్‌ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని ఆరా

మధ్యప్రదేశ్‌ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని ఆరా

భోపాల్‌ : కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్‌ చేశారు. తాను ఆ సమయంలో యోగా చేస్తున్నందున ప్రధానితో మాట్లాడలేకపోయానని సీఎం చౌహాన్‌ తెలిపారు. కొంతసేపటి తరువాత ఆయన మళ్లీ ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి అడిగి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారని చౌహాన్ ట్వీట్ చేశారు.

చౌహాన్ ప్రస్తుతం భోపాల్‌లోని చిరాయు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్నచర్యలపై ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో ఆయన సమీక్షించారు. కరోనా నియంత్రణకు ప్రజల సహకారంతోపాటు సామాజిక సేవా సంస్థల సహకారం కోరాలని  ఆయన సూచించారు.

తాజావార్తలు


logo