ఆదివారం 31 మే 2020
National - May 22, 2020 , 11:22:44

పశ్చిమబెంగాల్‌ కు చేరుకున్న ప్రధాని మోదీ..వీడియో

పశ్చిమబెంగాల్‌ కు చేరుకున్న ప్రధాని మోదీ..వీడియో

కోల్‌ కతా: పశ్చిమబెంగాల్‌ లో అంఫాన్‌ సృష్టించిన భీభత్సానికి 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. అంఫాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌ లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్‌ కు చేరుకున్నారు. 

కోల్‌ కతా ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం మమతాబెనర్జీ స్వాగతం పలికారు.  ప్రధాని మోదీ బెంగాల్‌తోపాటు ఒడిశాలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన పట్నాయక్‌ తో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.  ప్రధాని వెంట కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ ,  బాబుల్‌ సుప్రియో, ప్రతాప్‌ చంద్ర సారంగి, దేవశ్రీ చౌదరి ఉన్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo