ఆదివారం 05 జూలై 2020
National - Jul 01, 2020 , 15:32:25

డాక్ట‌ర్లు, సీఏల పాత్ర‌ల‌ను ప్ర‌శంసించిన ప్ర‌ధాని

డాక్ట‌ర్లు, సీఏల పాత్ర‌ల‌ను ప్ర‌శంసించిన ప్ర‌ధాని

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌లో డాక్ట‌ర్ల పాత్ర‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించారు.  డాక్ట‌ర్లు స్పూర్తిదాయ‌క పోరాటం చేస్తున్నార‌న్నారు.  వారి జీవితాల‌ను ప్ర‌మాదంలో పెట్టి, ప్ర‌జ‌ల జీవితాల‌ను కాపాడుతున్నార‌న్నారు.  డాక్ట‌ర్స్ డే సంద‌ర్భంగా ఇవాళ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.  డాక్ట‌ర్ల‌కు ఇండియా సెల్యూట్ చేస్తున్న‌ద‌ని, కోవిడ్‌19పై పోరులో డాక్ట‌ర్లు అసాధార‌ణ పోరాటం చేస్తున్నార‌న్నారు.  త‌ల్లులు జ‌న్మ‌నిస్తే, డాక్ట‌ర్లు పున‌ర్ జ‌న్మ‌ను ప్ర‌సాదిస్తార‌ని ఓ వీడియోను కూడా ఆయ‌న పోస్టు చేశారు. 

డాక్ట‌ర్ బీసీ రాయ్ జ‌యంతిని.. డాక్ట‌ర్స్ డేగా సెల‌బ్రేట్ చేసుకుంటారు.  జూలై ఒక‌ట‌వ తేదీని చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా గుర్తిస్తారు.  ఆర్థిక‌వ్య‌వ‌స్థ ఆరోగ్య‌క‌రంగా, పార‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు సీఏల పాత్ర విశేష‌మైంద‌న్నారు. దేశానికి సీఏలు చేస్తున్న సేవ‌లు విలువైన‌వ‌న్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo