మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 14:45:00

బెంగాల్‌కు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు: ప్రధాని మోదీ

బెంగాల్‌కు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు: ప్రధాని మోదీ

కోల్‌కతా: అంఫాన్‌ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు రూ.వెయ్యి కోట్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తుఫాను వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించగా, కోల్‌కతాలోని విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిపోవడంతోపాటు, వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. కష్ట సమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతుల కుంటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా ఢిల్లీ వదిలి బయటకు వచ్చారు. తుఫాన్‌ ప్రభావిత రాష్ర్టాలైన బెంగాల్‌, ఒడిశాల్లో ఎరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాటం కొనసాగిస్తున్నది చెప్పారు.


logo