శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 10:38:54

జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న మోదీ

జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న మోదీ

హైద‌రాబాద్:  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.  వ‌చ్చే మంగ‌ళ‌వారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.  అయితే దీనికి పూర్వ‌మే ప్ర‌ధాని మోదీ.. మ‌రోసారి అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు.  ఆ త‌ర్వాత లాక్‌డౌన్‌పై ఆయ‌న మళ్లీ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను పొడుగించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాన్ని కొన్ని మార్పులు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  అంత‌ర్‌రాష్ట్ర ర‌వాణా మాత్రం పూర్తిగా నిలిపివేయ‌నున్నారు.  కేవ‌లం నిత్యావ‌స‌రాల కోస‌మే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. స్కూళ్లు, కాలేజీలు, మందిరాల‌న్నీ మూసివేస్తారు.  ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు దివాళీ తీసే ప‌రిస్థితి ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో కొన్ని కంపెనీల‌కు స‌డ‌లింపు ఇచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.  రేపు సీఎంల‌తో జ‌రిగిన వీడియోకాన్ఫ‌రెన్స్ స‌మావేశం త‌ర్వాత మోదీ ప్ర‌క‌ట‌న చేసే ఛాన్సున్న‌ది.logo