బుధవారం 28 అక్టోబర్ 2020
National - May 29, 2020 , 17:21:55

ప్ర‌ధానితో హోంమంత్రి భేటీ.. లాక్‌డౌన్‌పై చ‌ర్చ‌!

ప్ర‌ధానితో హోంమంత్రి భేటీ.. లాక్‌డౌన్‌పై చ‌ర్చ‌!

న్యూఢిల్లీ: ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని 7 లోక్‌క‌ల్యాణ్ మార్గ్‌లో వీరి భేటీ జ‌రిగింది. దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త, లాక్‌డౌన్ త‌దిత‌ర అంశాల‌పై ఈ భేటీలో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. హోమంత్రి అమిత్‌షా గురువారం రాత్రి ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఫోన్ లాక్‌డౌన్‌పై అభిప్రాయాలు కోరారు. ఈ నేప‌థ్యంలో అమిత్ షా ప్ర‌ధానితో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

ఇదిలావుంటే, దేశంలో గురువారం ఉద‌యం నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల్లో 7467 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా కాలుమోపిన త‌ర్వాత ఒకేరోజు ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇంకా ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాలి అనే అంశంపై వారి భేటీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది. కాగా, రెండు వారాల్లో లాక్‌డౌన్ ముగుస్తున్న నేప‌థ్యంలో కేంద్రం మ‌ళ్లీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతుందోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న‌ది.          logo