శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 09:49:29

మ‌న భూభాగాన్ని ప్ర‌ధాని మోదీ చైనాకు స‌మ‌ర్పించారు: రాహుల్ గాంధీ

మ‌న భూభాగాన్ని ప్ర‌ధాని మోదీ చైనాకు స‌మ‌ర్పించారు:  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: భారత భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదని ప్రధాని మోదీ నిన్న జ‌రిగిన అఖిల ప‌క్ష భేటీలో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. సరిహద్దుల్లో మన సైనిక పోస్టులను చైనా ఆక్ర‌మించ‌లేద‌న్నారు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్ర‌ధాని మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  మ‌న భూభాగాన్ని చైనాకు ప్ర‌ధాని మోదీ అప్ప‌గించార‌ని ఆయ‌న ఆరోపించారు. ట్విట్ట‌ర్‌లో రాహుల్ త‌న విమ‌ర్శ‌లు చేశారు. ఒక‌వేళ ఆ భూభాగం చైనాదే అయితే, మ‌రి మ‌న సైనికుల్ని ఎందుకు చంపార‌ని ఆయ‌న అడిగారు. భార‌తీయ సైనికుల్ని ఏ ప్రాంతంలో చెప్పాలంటూ ప్ర‌ధాని మోదీని రాహుల్ ప్ర‌శ్నించారు. 

భరతమాత వైపు ఎవరు కన్నెత్తి చూడకుండా మన వీర సైనికులు గట్టి బుద్ధి చెప్పారని అఖిల ప‌క్ష భేటీలో మోదీ తెలిపారు. భారతదేశం బయటిశక్తులకు తలొగ్గదన్నారు. గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడారు. సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక సమస్య సృష్టిస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు గట్టిగా బుద్ధిచెప్పే వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సమావేశంలో నేతలు సూచించిన విష‌యం తెలిసిందే.
logo