మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 13:21:39

ప్ర‌ధాని మోదీకి ఆరుగురు తోబొట్టువులు..

ప్ర‌ధాని మోదీకి ఆరుగురు తోబొట్టువులు..

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం.. కొత్త ట‌ర్న్ తీసుకున్న‌ది. ఈనెల 28వ తేదీన తొలి ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం ప్ర‌చారంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్‌.. ఆర్జేడీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.  కుమారుడి కోసం ఓ కుటుంబం 9 మంది సంతానాన్ని క‌న్న‌ట్లు ఆరోపించారు. ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్‌, ర‌బ్రీ దేవిల‌కు 9 మంది పిల్ల‌లు ఉన్నారు. వారిలో తేజ‌స్వి యాద‌వ్ 8వ సంతానం.  అబ్బాయి కావాల‌న్న ఉద్దేశంతో లాలూ దంప‌తులు 9 మంది పిల‌ల్ని క‌న్నారు.  లాలూ వైఖ‌రిని ఖండిస్తూ సీఎం నితీశ్ కుమార్ చేసిన కామెంట్ల ప‌ట్ల ఆర్జేడీ నేత తేజ‌స్వియాద‌వ్ స్పందించారు.  నితీశ్ అవ‌మానాల‌ను దీవెన‌లుగా స్వీక‌రిస్తున్న‌ట్లు తేజ‌స్వి అన్నారు. కానీ సీఎం నితీశ్ మ‌హిళ‌ల‌ను, త‌న త‌ల్లి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా మాట్లాడిన‌ట్లు ఆరోపించారు.  

ఆదివారం ప్ర‌చారంలో లాలూను టార్గెట్ చేస్తూ నితీశ్‌.. వారికి ఆడ‌పిల్ల‌ల‌పై న‌మ్మ‌కం లేద‌ని, అందుకే 9 మంది పిల్ల‌ల‌ను క‌న్నార‌ని ఆరోపించారు. అనేక మంది అమ్మాయిల త‌ర్వాత‌.. ఓ కుమారుడు పుట్టాడ‌ని, ఇలాంటి బీహార్‌ను వాళ్లు కావాల‌నుకుంటున్నార‌ని నితీశ్ ఆరోపించారు.  త‌న కుటుంబంపై కామెంట్ చేసిన నితీశ్‌.. ప‌రోక్షంగా ప్ర‌ధాని మోదీ కుటుంబాన్ని కూడా త‌ప్పుప‌ట్టిన‌ట్లు ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ విమ‌ర్శించారు.  ప్ర‌ధాని మోదీకి కూడా ఆరు మంది తోడ పుట్టిన‌వారు ఉన్నార‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం, అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాల‌పై ప్ర‌భుత్వం మాట్లాడ‌డం లేద‌ని తేజ‌స్వి విమ‌ర్శించారు.