మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 14:04:50

చైనా వ‌త్తిడిలో న‌లుగుతున్న‌ మోదీ ప్ర‌తిష్ట : రాహుల్ గాంధీ

చైనా వ‌త్తిడిలో న‌లుగుతున్న‌ మోదీ ప్ర‌తిష్ట :  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీని రాహుల్ గాంధీ మ‌ళ్లీ టార్గెట్ చేశారు. ఇటీవ‌ల చైనాతో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌ధాని మోదీ బ‌ల‌హీనంగా మారిన‌ట్లు రాహుల్ ఆరోపించారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఇవాళ రాహుల్ ఓ వీడియోను పోస్టు చేశారు.  దాంట్లో మోదీ వైఖ‌రిని ఖండించారు.  అధికారంలోకి వ‌చ్చేందుకు తానో బ‌ల‌వంతుడిన‌న్న బూట‌క‌పు ఇమేజ్‌ను క్రియేట్ చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు.  బ‌ల‌మైన నేత‌న‌న్న అభిప్రాయాల్ని జ‌నంలో మోదీ క్రియేట్ చేయ‌డం అది ఆయ‌న గొప్ప బ‌లం అని రాహుల్ ఆరోపించారు. కానీ ఇప్పుడు అది భార‌త్‌కు బ‌ల‌హీనంగా మారింద‌ని కాంగ్రెస్ నేత విమ‌ర్శించారు.  మోదీ ప్ర‌తిష్ట‌కు, చైనా ప్ర‌ణాళిక‌ల‌కు ఏ ర‌కంగా సంబంధం ఉంటుందో రాహుల్ త‌న వీడియోలో వివ‌రించారు.  శుక్ర‌వారం కూడా రాహుల్ తొలి వీడియోను రిలీజ్ చేశారు. 

యావ‌త్ భూమండ‌లాన్ని చేజిక్కించుకోవాల‌ని చైనా ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్లు రాహుల్ త‌న వీడియోలో ఆరోపించారు.  ప్ర‌ణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయ‌ర‌ని, వారు త‌మ మ‌ధిలో ఓ ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసుకున్నార‌ని, దానికి త‌గిన‌ట్లుగా వాళ్లు ఆ ప్ర‌పంచాన్ని త‌యారు చేసుకుంటున్నార‌ని రాహుల్ అన్నారు. దానిలో భాగ‌మే గ‌దార్, బెల్ట్ రోడ్ అని అన్నారు. వాళ్లు పూర్తిగా భూగ్ర‌హాన్ని మార్చేస్తున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. అయితే ఇలాంటి వ్యూహాత్మ‌క స‌మ‌యంలో.. కీల‌క‌మైన గాల్వాన్‌, డెమ్చోక్‌, పాన్‌గాంగ్ స‌ర‌స్సుల వ‌ద్ద చైనా త‌న‌ ప్రాభ‌వాన్ని పెంచుకున్న‌ట్లు రాహుల్ తెలిపారు. మ‌న హైవేల వ‌ల్ల వాళ్లు డిస్ట‌ర్బ్ అవుతున్న‌ట్లు చెప్పారు. పాకిస్థాన్‌తో కలిసి క‌శ్మీర్‌లో ఏదైనా చేయాల‌న్న త‌ప‌న‌తో చైనా ఉన్న‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు.

భార‌త్, చైనా మ‌ధ్య ఉన్న ఉద్రిక్త‌లు కేవ‌లం స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌గా చూడ‌రాద‌న్నారు. బోర్డర్ స‌మ‌స్య‌తో ప్ర‌ధాని మోదీపై వ‌త్తిడి తెస్తున్నార‌ని, మోదీ ప్ర‌తిష్ట‌పై చైనీయులు దాడి చేస్తున్నార‌ని రాహుల్ అన్నారు. తాము చెప్పిన‌ట్లు చెప్ప‌కుంటే, మోదీ బ‌ల‌మైన నేత అన్న భావాన్ని రూపుమాపేవిధంగా చైనా వ్య‌వ‌హారిస్తున్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. ఇప్పుడు ఇది కీల‌క‌మైన ద‌శ అని, ప్ర‌ధాని మోదీ దీనికి అంగీక‌రిస్తారా లేదా అన్నది ముఖ్య‌మ‌న్నారు. కానీ ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌తిష్ట ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంద‌ని రాహుల్ అన్నారు. చైనీయులు మ‌న భూభాగంలోకి ఎంట‌ర్ అయ్యారు, కానీ ఎవ‌రూ రాలేద‌ని మోదీ అంటున్నార‌ని, అంటే చైనా వ‌త్తిడికి మోదీ త‌లొగ్గిన‌ట్లు అర్థ‌మ‌వుతున్న‌ద‌ని రాహుల్ తెలిపారు. చైనా చెప్పిన‌ట్లు మోదీ వింటే, ఆయ‌న ఈ దేశానికి ప్ర‌ధాని కాదు అని రాహుల్ విమ‌ర్శించారు. logo