మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 10:39:41

బృహ‌త్త‌ర మ‌ద్ద‌తుకు గ‌ర్విస్తున్నా: ప‌్ర‌ధాని మోదీ

బృహ‌త్త‌ర మ‌ద్ద‌తుకు గ‌ర్విస్తున్నా: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లిలో భారత తాత్కాలిక స‌భ్య‌త్వానికి మ‌ద్ధ‌తు తెలిపిన దేశాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి ల‌భించిన బృహ‌త్త‌ర‌మైన మ‌ద్ద‌తుకు తాను గ‌ర్విస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ప్రపంచ శాంతి, భ‌ద్ర‌త‌, స‌మాన‌త్వం కోసం భార‌త్‌ ఐక్యరాజ్యస‌మితి స‌భ్య‌దేశాల‌తో క‌ల‌సి ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక‌తోపాటు ఆర్థిక‌, సామాజిక మండ‌ళ్ల ఎన్నిక‌.. శాశ్వ‌త, తాత్కాలిక సభ్య‌దేశాల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా భార‌త్ ఐక్య‌రాజ్య‌స‌మితి తాత్కాలిక స‌భ్య‌దేశంగా ఎన్నికైంది. మొత్తం 193 స‌భ్య‌దేశాల్లో 184 దేశాలు భార‌త స‌భ్య‌త్వానికి మ‌ద్ద‌తు తెలిపాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన అన్ని దేశాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ‌‌  


logo