శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 11:01:34

యూపీ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

యూపీ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. యూపీ ప్రభుత్వం సహాయక చర్యల్లో పాల్గొన్నదని మోదీ తెలిపారు. యూపీలోని ఔరయ వద్ద రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం విదితమే. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న ట్రక్కు శనివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఔరయ వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇందులో బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.  


logo