ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 19:39:35

చైనా చర్యలను ప్రధాని బహిరంగంగా ఖండించాలి : కాంగ్రెస్‌

చైనా చర్యలను ప్రధాని బహిరంగంగా ఖండించాలి : కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : గాల్వన్‌ లోయ వద్ద చైనా-భారత్ మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, కపిల్ సిబల్ మోదీపై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి, దురాక్రమణలకు పాల్పడున్న చైనా చర్యలను ప్రధాని ఎందుకు బహిరంగంగా ఖండించడం లేదని కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. చైనాపై తీసుకునే చర్యలకు తాము పూర్తిగా మద్దతిస్తామని, చైనా చర్యలను ప్రధాని బహిరంగా ఖండించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.

ఇండో–చైనా సరిహద్దుకు చెందిన పలు శాటిలైట్‌ చిత్రాను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ‘2020 మే 22, జూన్ 22న భారత్‌-చైనా సరిహద్దుల్లోని చిత్రాలకు ఉన్న తేడాలను గమనించండి’  అని ఆ ట్వీట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా వ్యాఖ్యాలను చిదంబరం ఖండించారు. నడ్డా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. చైనా దురాక్రమణకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. logo