సోమవారం 18 జనవరి 2021
National - Dec 04, 2020 , 12:23:35

కోవిడ్‌పై అఖిల‌ప‌క్ష భేటీ.. దేవ‌గౌడ‌తో మాట్లాడిన ప్ర‌ధాని

కోవిడ్‌పై అఖిల‌ప‌క్ష భేటీ.. దేవ‌గౌడ‌తో మాట్లాడిన ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: దేశంలో కోవిడ్‌19 మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ అఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం ఏర్పాటు చేశారు.  ఈ నేప‌థ్యంలో మాజీ ప్ర‌ధాని, జ‌న‌తాద‌ళ్ చీఫ్ హెచ్‌డీ దేవ‌గౌడ‌తో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు.  వీడియోకాన్ఫ‌ర్స్ ద్వారా ఈ భేటీ జ‌రిగింది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్‌లీడ‌ర్ల‌తో ప్ర‌ధాని సంభాషించారు.  అయిదు లేదా అంత‌క‌న్న ఎక్కువ సంఖ్య ఎంపీలు ఉన్న పార్టీ నేత‌ల‌తో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ త‌ర‌పున గులాం న‌బీ ఆజాద్‌, టీఎంసీ త‌ర‌పున సుదీప్ బందోపాధ్యాయ‌, ఎన్సీపీ త‌ర‌పున శ‌ర‌ద్ ప‌వార్‌, టీఆర్ఎస్ త‌ర‌పున నామా నాగేశ్వ‌రరావు, శివ‌సేన త‌ర‌పున వినాయ‌క్ రౌత్‌లు వ‌ర్చువ‌ల్ భేటీలో పాల్గొంటున్నారు. కోవిడ్ టీకా ల‌భ్య‌త‌, పంపిణీ అంశాల గురించి విప‌క్ష నేత‌లు ప్ర‌ధానిని అడిగారు. ఈ భేటీలో కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌లు పాల్గొన్నారు.  కోవిడ్ వ్యాక్సిన్ పురోగ‌త‌ని స‌మీక్షించేందుకు ప్ర‌ధాని మోదీ ఇటీవ‌లే మూడు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే.