మంగళవారం 07 జూలై 2020
National - Jun 15, 2020 , 16:50:44

ఒక్క వెంటిలేటర్‌కు రూ. నాలుగు లక్షలా!

ఒక్క వెంటిలేటర్‌కు రూ. నాలుగు లక్షలా!

న్యూ ఢిల్లీ: కేంద్ర సర్కారు వెంటిలేటర్స్‌కు పీఎం కేర్‌ ఫండ్స్‌నుంచి కేటాయించిన నిధులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందించేందుకుగానూ పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి 50,000 వెంటిలేటర్ల కోసం రూ. 2000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఇటీవల మోడీ సర్కారు ప్రకటించింది. అంటే స్వదేశంలో తయారయ్యే ఒక్కో వెంటిలేటర్‌కు రూ. నాలుగు లక్షలు అవుతున్నాయి. దీనిపై ప్రజలు పెదవివిరిచారు. సోషల్‌ మీడియా ద్వారా ఫన్నీ పోస్టులు, ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే, వెంటిలేటర్స్‌పై పీఎం కేర్‌ ఫండ్స్‌ నిధుల నుంచి అని స్టిక్కర్‌ అంటించడంపైనా అసహనం వ్యక్తంచేశారు. 

   అమెరికా అధ్యక్షుడు పంపిన వంద వెంటిలేటర్లకూ స్టిక్కర్‌ అంటించారా? అంటూ పలువురు ట్వీట్‌ చేశారు. మరొకరు చంద్రుని ఫొటోపై పీఎం కేర్‌ ఫండ్స్‌ స్టిక్కర్‌ అంటించి ఉన్న ఇమేజ్‌ను పోస్ట్‌ చేసి, ఇది బీజేపీ సర్కారు ఘనతే అని చురకంటించారు.  ఇండియన్‌ రైల్వేస్‌, ఐఐటీ రూర్కీతోపాటు ఇతర సంస్థలు రూ. పది వేల నుంచి రూ. లక్షలోపు వెంటిలేటర్లు తయారు చేస్తామని ముందుకొస్తుంటే కేంద్ర సర్కారు రూ. నాలుగు లక్షలు కేటాయించడమేంటని పలువురు ప్రశ్నించారు.  ఇదిలా ఉండగా, స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకూ దేశంలోని అన్ని దవాఖానల్లో కలిపి 47,000 వెంటిలేటర్లుంటే ఇప్పుడు మోడీ వల్ల ఒక్క ఏడాదిలోనే 50,000 వెంటిలేటర్లు రాబోతున్నాయని కొందరు కేంద్ర సర్కారుకు సపోర్ట్‌గా ట్వీట్‌ చేశారు.  logo