ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 10:23:21

పీఎం కేర్స్ ఫండ్ అన‌వ‌స‌రం..

పీఎం కేర్స్ ఫండ్ అన‌వ‌స‌రం..


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌మంతా లాక్‌డౌన్ విధించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అయితే సీపీఎం పార్టీ ఆ నిధిపై విమ‌ర్శ‌లు చేసింది. పుల్వామా దాడి జ‌రిగిన త‌ర్వాత కూడా ఇలాంటి ఫండ్‌నే ఏర్పాటు చేశార‌ని, కానీ దాంట్లో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని సీపీఎం పేర్కొన్న‌ది. కోవిడ్‌19 కోసం ప్ర‌త్యేక నిధి అవ‌స‌రం లేద‌ని ఆ పార్టీ పోలిట్ బ్యూరో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 1948 నుంచి పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ వాడుక‌లో ఉన్న‌ద‌ని, దాంట్లో ఇప్ప‌టికీ 3800 కోట్లు ఖ‌ర్చు చేయ‌కుండా ఉన్నాయ‌ని ఆ పార్టీ వెల్ల‌డించింది. 


logo