ఆదివారం 23 ఫిబ్రవరి 2020
వ‌ర్చువ‌ల్ ల్యాబ్స్‌పై దృష్టిపెట్టండి: ప్ర‌ధాని మోదీ

వ‌ర్చువ‌ల్ ల్యాబ్స్‌పై దృష్టిపెట్టండి: ప్ర‌ధాని మోదీ

Feb 15, 2020 , 12:04:03
PRINT
వ‌ర్చువ‌ల్ ల్యాబ్స్‌పై దృష్టిపెట్టండి: ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌:  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీస‌ర్చ్‌(సీఎస్ఐఆర్‌) శాస్త్ర‌వేత్త‌ల‌తో ఢిల్లీలో ఇవాళ ప్ర‌ధాని మోదీ స‌మావేశం నిర్వ‌హించారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి సీఎస్ఐఆర్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వ‌ర్చువ‌ల్ ప‌రిశోధ‌న‌శాల‌ల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ధాని వారికి సూచించారు. విజ్ఞాన‌శాస్త్రం ప‌ట్ల విద్యార్థుల‌ను ఆక‌ర్షించే విధంగా ప్ర‌య‌త్నాలు చేయాల‌న్నారు. భ‌విష్య‌త్తు త‌రాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ఫ‌థాన్ని పెంపొందించాల‌న్నారు.  ఆర్ అండ్ డీ ప్రాజెక్టుల‌ను మ‌రింత విస్తృత‌ప‌రుచాల‌న్నారు.  పోష‌కాహారం లాంటి సామాజిక అంశాల‌పై సీఎస్ఐఆర్ దృష్టిపెట్టాల‌న్నారు. ఆహార ఉత్ప‌త్తులు, నీటి సంర‌క్ష‌ణ గురించి కూడా వ‌ర్కౌట్ చేయాల‌న్నారు.  సామాన్యుడి జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచే విధంగా కూడా సీఎస్ఐఆర్ కృషి చేయాల‌న్నారు.  


logo