సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 14:55:00

ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి

ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్‌:  ఢిల్లీలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై స‌మ‌గ్ర స్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈశాన్య ఢిల్లీలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్పేందుకు పోలీసులు, ఇత‌ర ఏజెన్సీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. శాంతి, సామ‌రస్యం మ‌న స‌మాజంలో భాగ‌మ‌న్నారు. అన్ని వేళ‌లా శాంతిని, సామ‌ర‌స్యాన్ని కాపాడాల‌ని ఢిల్లీలోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌శాంత‌త‌ను, సాధార‌ణ ప‌రిస్థితుల‌ను ఏర్పాడేలా చూడాల‌న్నారు. ఢిల్లీ అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది మృతిచెందారు. మ‌రో 180 మంది గాయ‌ప‌డ్డారు. సీఏఏ వ్య‌తిరేక‌, అనుకూల వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల వ‌ల్ల ఢిల్లీ ర‌ణ‌రంగంగా మారింది. 

logo