మంగళవారం 02 జూన్ 2020
National - Feb 05, 2020 , 11:43:46

అయోధ్య‌లో రామాల‌యం.. ట్ర‌స్టు ప్ర‌క‌టించిన మోదీ

అయోధ్య‌లో రామాల‌యం.. ట్ర‌స్టు ప్ర‌క‌టించిన మోదీ

హైద‌రాబాద్‌:  అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణం కోసం కేంద్రం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది.  ఆల‌య నిర్మాణం కోసం ట్ర‌స్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇవాళ లోక్‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రామాల‌యం అభివృద్ధి కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ట్ర‌స్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఆ ట్ర‌స్టుకు శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్రం అని పేరు పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మెదీ చెప్పారు.  ఇవాళ ఉద‌యం జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.  ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు సంతోషిస్తున్న‌ట్లు చెప్పారు.  శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్రం.. స్వ‌తంత్య్ర సంస్థ‌గా ప‌నిచేస్తుంద‌న్నారు.  రామ మందిరాన్ని సంద‌ర్శించే భ‌క్తుల కోసం మ‌రో భారీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మోదీ చెప్పారు.  మందిరం వ‌ద్ద ఉన్న 67 హెక్టార్ల భూమిని ట్ర‌స్టుకు కేటాయిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలో జీవిస్తున్న ప్ర‌తి మ‌తానికి చెందిన వారు ఉన్న‌తంగా జీవించాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు.  హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్త‌వులు, బౌద్దులు, పార్సీలు, జైనులు అంద‌రూ ఒక కుటుంబంలో భాగ‌మ‌ని, కుటుంబంలో ప్ర‌తి ఒక్క స‌భ్యుడి అభివృద్ధిని కాంక్షిస్తున్నామ‌ని అన్నారు.  స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న విధానంతో త‌మ ప్ర‌భుత్వం ముందుకు వెళ్తున్న‌ద‌ని,  ఆ విధానం వ‌ల్ల అంద‌రూ సంతోషంగా ఉండాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.logo