ఆదివారం 12 జూలై 2020
National - Jun 02, 2020 , 05:28:48

వ్యాక్సిన్‌ వచ్చే వరకు స్కూళ్లు తెరువొద్దు!

వ్యాక్సిన్‌ వచ్చే వరకు స్కూళ్లు తెరువొద్దు!

న్యూఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే వరకు గానీ, దేశంలో పరిస్థితి మెరుగు పడే వరకు గానీ పాఠశాలలు పునఃప్రారంభించొద్దని కేంద్రానికి 2.13 లక్షల మంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక పిటిషన్‌పై వారు సంతకాలు చేశారు. విద్యా సంస్థలను తెరిచే అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. జూలైలో విద్యా సంస్థలు తెరిస్తే పరిస్థితి దారుణమవుతుందని తల్లిదండ్రులు ఆ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. 


logo